ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోని కమ్‌బ్యాక్! (వీడియో)

10130చూసినవారు
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. తొలి మ్యాచ్‌కు దూరమైన మహేంద్రసింగ్ ధోని మళ్లీ జట్టులోకి రాబోతున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న ధోని తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని సిక్సర్లు, బౌండరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్‌లోనే మైదానంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన సీఎస్‌కే, రేపు చెన్నై వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ధోని జట్టులోకి వస్తే జట్టుకు మరింత బలం చేకూరే అవకాశముంది. అయితే ధోని ఆడుతాడా లేదా అన్నది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్