ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రైతుల నుంచి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ధాన్యం సేకరించి, కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి, రూ.11,300 కోట్లను 24 గంటల్లోనే రైతులకు అందించామని, రూ.7,300 కోట్లను 8 గంటల్లోనే జమ చేశామని తెలిపారు. రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, 2.01 లక్షల మంది రైతులకు రూ.4,575 కోట్లను 48 గంటల్లో అందించామని పేర్కొన్నారు.