రైతులకు గుడ్ న్యూస్.. వారం ముందే వచ్చిన యూరియా

30529చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్.. వారం ముందే వచ్చిన యూరియా
AP: సెప్టెంబర్ 6వ తేదీన రావాల్సిన యూరియా.. సీఎం చంద్రబాబు చొరవతో వారం ముందే రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర రైతుల అవసరాల కోసం ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) నుంచి గంగవరం పోర్టుకు 10,350 టన్నుల యూరియా వచ్చింది. దీన్ని రైతులకు వెంటనే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో కాకినాడ పోర్టుకు 25 వేల టన్నుల యూరియా వస్తుందని మంత్రి అచ్చెన్న తెలిపారు.

సంబంధిత పోస్ట్