గోదావరి డెల్టా రైతులకు శుభవార్త.. సాగునీటి విడుదల

35చూసినవారు
గోదావరి డెల్టా రైతులకు శుభవార్త.. సాగునీటి విడుదల
AP: తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలకు అధికారులు సాగునీటిని విడుదల చేశారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. సుమారు 10 లక్షల 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దీంతో తూ.గో, ప.గో, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని రైతులు ప్రయోజనం పొందనున్నారు.

సంబంధిత పోస్ట్