AP: డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించడంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం నెల రోజుల్లో ఆదేశాలు జారీ చేయనుంది. 2018 జులై నుంచి పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ అరియర్లు చెల్లించినప్పటికీ, పలు కారణాల వల్ల చాలా మందికి అవి అందలేదు. ఈ నేపథ్యంలో, సీఎఫ్ఎంఎస్‌లో అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించేందుకు వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.