సంక్రాంతి పండుగ సందర్భంగా చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆప్కో బకాయిల్లో భాగంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. గతంలో డిసెంబర్‌లో రూ.2.42 కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో రూ.5 కోట్లు చెల్లించాలని మంత్రి సవిత ఆప్కో యాజమాన్యానికి ఆదేశించారు. చేనేత సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి, నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు.