భారత్‌కు గుడ్ న్యూస్.. హర్ముజ్ దాటిన 15 ఎరువుల నౌకలు

17696చూసినవారు
భారత్‌కు గుడ్ న్యూస్.. హర్ముజ్ దాటిన 15 ఎరువుల నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య కూడా భారత్ ఎరువుల సరఫరాను విజయవంతంగా నిర్వహించింది. హర్ముజ్ జలసంధి దాటిన 20 ఎరువుల నౌకల్లో 15 ఇప్పటికే భారత రేవులకు సురక్షితంగా చేరుకున్నాయి. వీటిలో యూరియా, డీఏపీ, సల్ఫర్ వంటి కీలక ఎరువులు భారీ మొత్తంలో ఉన్నాయి. మిగిలిన నౌకలు కూడా త్వరలోనే చేరనున్నాయి. మరోవైపు దేశీయంగా ఎరువుల ఉత్పత్తి కూడా అంచనాలను మించి పెరిగింది. దీంతో ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలతో ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులు కొనసాగిస్తూ సరఫరా గొలుసును స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం దేశంలో 163 లక్షల టన్నులకుపైగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్