కిడ్నీ రోగులకు శుభవార్త.. రాష్ట్రంలో 7 కొత్త డయాలసిస్ కేంద్రాలు

15963చూసినవారు
కిడ్నీ రోగులకు శుభవార్త.. రాష్ట్రంలో 7 కొత్త డయాలసిస్ కేంద్రాలు
AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆస్పత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్‌సీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రతి కేంద్రంలో రోజుకు 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుంది. PMNDP కింద ఒక్కో కేంద్రానికి రూ.75 లక్షల వ్యయంతో యంత్రాలు, పరికరాలు సమకూరుస్తారని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :