పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6.30 నుంచే పంపిణీ

28చూసినవారు
పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6.30 నుంచే పంపిణీ
AP: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అక్టోబర్‌ 1న ఉదయం 6.30 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమించడంతో పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబర్‌ 30న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది బ్యాంకుల నుంచి పింఛను నగదును ఉపసంహరించుకుని మరుసటి రోజు లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు. అక్టోబర్‌ నెలకు ప్రభుత్వం రూ.2,692.34 కోట్లు విడుదల చేసిందని, రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్