ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్లు, ఇనాక్టివ్ అయిన ఖాతాలను గుర్తించడం కష్టంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా, ఈపీఎఫ్ఓ ఆగస్టు నెలాఖరు నాటికి 'ఇ-ప్రాప్తి' అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్ ద్వారా ఖాతాదారులు తమ పాత లేదా ఇనాక్టివ్ అయిన పీఎఫ్ ఖాతాలను సులభంగా గుర్తించవచ్చు. బ్యాలెన్స్ చెక్, నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవలం ఆధార్ నంబర్ ద్వారా పాత అకౌంట్లను గుర్తించడంతో పాటు, UAN అనుసంధానం, యాక్టివేషన్ వంటి పనులు కూడా ఇంటి నుంచే చేసుకోవచ్చు.