ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 4న మరికొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్-గోరఖ్‌పూర్ (07075) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 4 నుండి 25 వరకు ప్రతి శుక్రవారం, గోరఖ్‌పూర్-హైదరాబాద్ (07076) స్పెషల్ రైలు సెప్టెంబర్ 6 నుండి 27 వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, నాగ్‌పూర్, భోపాల్, కాన్పూర్ సెంట్రల్, లక్నో మీదుగా ప్రయాణిస్తాయి. తెలంగాణ ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.