'తల్లికి వందనం' లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 7 వరకు ఛాన్స్

26చూసినవారు
'తల్లికి వందనం' లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 7 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం కింద రూ.13,000 ఆర్థిక సాయం అందని అర్హులకు మరో అవకాశం కల్పించింది. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు ఆగస్టు 3తో ముగియాల్సి ఉండగా, దానిని ఆగస్టు 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేని వారు నిర్ణీత గడువులోపు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే బ్యాంకు ఖాతా NPCIతో అనుసంధానమైందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్