ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్‌ను ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన స్లాట్లు అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణయించిన తేదీల్లో జిల్లా బోధనాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు హాజరుకావాలి. సదరం సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్ అర్హతలు నిర్ణయిస్తారు. కాగా, దివ్యాంగులకు రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు నెలవారీ పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే.