ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసిన రూ.923.55 కోట్లను మినహాయించనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ.. ఏడాది పాటు ప్రజలకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు APERC ఉత్తర్వులు జారీ చేసింది.