పొగాకు రైతులకు శుభవార్త.. నేటి నుంచి ఆర్థిక సాయం, వడ్డీలేని రుణాలు

15చూసినవారు
పొగాకు రైతులకు శుభవార్త.. నేటి నుంచి ఆర్థిక సాయం, వడ్డీలేని రుణాలు
AP: పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. లోగ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున ఆర్థిక సాయాన్ని నేటి (గురువారం) నుంచి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. దాదాపు 100 మిలియన్ కిలోల అధిక ఉత్పత్తికి రూ.100 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే పొగాకు బోర్డు పరిధిలో లేని కౌలు రైతులకు కూడా రెండేళ్ల వెసులుబాటుతో వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. అధిక ఉత్పత్తితో ధరలు పడిపోవడంతో రైతులకు అండగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్