AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు స్పౌజ్ కేటగిరీ కింద అంతర్ జిల్లాల బదిలీలు కోరుకుంటే వారికి అనుమతి ఇచ్చింది. దరఖాస్తులు మాత్రం ఆన్‌లైన్‌లో సమర్పించారు. నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్‌ఫర్ యూనిట్లుగా గుర్తించింది.