AP: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉపాధి పరిశ్రమలు స్థాపించుకునేందుకు మహిళలకు ప్రభుత్వం సహాయం చేయనుంది. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు డెయిరీ, పచ్చళ్లు, కలంకారి, ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాట్లు చేసుకోవచ్చు. యూనిట్ పెట్టిన వారు కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇవ్వాలి.. అలా చేస్తే యూనిట్ విస్తరణకు రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు బ్యాంకుల సాయంతో రుణాలు ఇవ్వనుంది.