మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50 లక్షల వరకు రుణాలు

165చూసినవారు
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50 లక్షల వరకు రుణాలు
AP: మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలు స్వయంగా పరిశ్రమలు పెట్టి స్వశక్తితో ఎదగాలని, వారికి అన్నివిధాలా ప్రభుత్వం అండగా నిలబడుతోంది. అందులో భాగంగా మహిళల స్వయం ఉపాధికి రాయితీతో రుణాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత మహిళలకు బ్యాంకు లింకేజీ ఆధారంగా పీఎంఈజీపీ కింద గరిష్టంగా రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. మెక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవాలనుకునే వారికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఈ రెండు లోన్లపై 35 శాతం రాయితీ ఇస్తోంది.

సంబంధిత పోస్ట్