ఏపీ పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు ప్రతి బార్న్‌కు రూ.50 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారం నుంచి పొగాకు రైతులకు ఉపశమనం లభించనుంది.