కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహ కల్పనే లక్ష్యంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకాన్ని 2029 వరకు పొడిగించింది. సొంతిల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ స్కీమ్‌కి రేషన్ కార్డు, ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చిన తర్వాత సాయం అందజేస్తారు. కేంద్ర సాయంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అదనపు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నాయి.