గుడ్ న్యూస్.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌ పెంపు

11894చూసినవారు
గుడ్ న్యూస్.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌ పెంపు
AP: రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌ను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 70 ఏళ్లు నిండిన పెన్షనర్ల బేసిక్‌పై 7-10%, 75 ఏళ్లు నిండిన వారికి 12-15% పెన్షన్ పెంచింది. 80 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం అమలులో ఉన్న 20%, 25 %, 30%, 35%, 50% రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పెంచిన పెన్షన్లు ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి అమల్లోకి రానుంది.

సంబంధిత పోస్ట్