AP: కూటమి సర్కార్
పేదలకు ఉచిత ఇళ్లకు సంబంధించి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్ర గృహనిర్మాణ పథకాన్ని పీఎం ఆవాస్
యోజన-2.0 తో అనుసం
ధానం చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా కొత్తగా ఎంపిక చేసేవారికి.. ఇల్లు కట్టుకోవడానికి రూ.4 లక్షలు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్రం వాటా 60 % ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 % ఉండనుంది. ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు.