గుడ్‌ న్యూస్.. ప్రవాసాంధ్రులకు ప్రత్యేక బీమా పథకం

90చూసినవారు
గుడ్‌ న్యూస్.. ప్రవాసాంధ్రులకు ప్రత్యేక బీమా పథకం
AP: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘ప్రవాసాంధ్ర భరోసా’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం యూఏఈలో ప్రారంభించనున్నారు. విదేశాల్లో దురదృష్టవశాత్తు మరణించిన ప్రవాసీయుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రవాసాంధ్రుల కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you