AP: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గూడ్స్ రైలుకు చెందిన బోగీలు రెండు రైల్వే లైన్లపై పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ఘటనతో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.