చేపలు తినేటప్పుడు గొంతులో ముల్లు ఇరుక్కుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే కోల్డ్ డ్రింక్స్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ లేదా వెనిగర్ వంటి సాధారణ ఇంటి చిట్కాలతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోల్డ్ డ్రింక్స్‌లోని కార్బన్ డై ఆక్సైడ్, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్, ఆలివ్ ఆయిల్ లేదా వెనిగర్ గొంతును జిడ్డుగా మార్చి ముల్లును కరిగించి లేదా జారేలా చేసి కడుపులోకి వెళ్లేలా చేస్తాయి. అయితే, నొప్పి ఎక్కువగా ఉన్నా, రక్తం వస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.