ప్రియురాలితో గోట్ నటుడి పెళ్లి.. మలేసియాలో గ్రాండ్ వెడ్డింగ్

13455చూసినవారు
ప్రియురాలితో గోట్ నటుడి పెళ్లి.. మలేసియాలో గ్రాండ్ వెడ్డింగ్
తమిళ, మలయాళ చిత్రసీమల్లో గుర్తింపు పొందిన నటుడు అరవింద్ ఆకాశ్ తన ప్రియురాలు సారాను వివాహం చేసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల వయసులో వీరిద్దరి వివాహం మలేసియాలోని కౌలాలంపూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు వెంకట్ ప్రభు, నటుడు వైభవ్ కూడా హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. అరవింద్ ఆకాశ్ 'చెన్నై 600028', 'మానాడు', 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్