అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు

81చూసినవారు
అధిక వడ్డీ ఆశ చూపి మోసం.. ప్రభుత్వం చర్యలు
AP: కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు వసూలు చేసి మోసం చేసిన 'శ్రేయ గ్రూప్'పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సంస్థ యజమానులు హేమంత్ కుమార్, సంగీతారాయ్ పేరిట ఉన్న ఆస్తులను సీజ్ చేసేందుకు సీఐడీకి అనుమతి మంజూరు చేసింది. దీనిలో భాగంగా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలో వీరి 51.55 ఎకరాల భూమిని సీఐడీ స్వాధీనం చేసుకోనుంది. ఈ వ్యవహారంలో భార్యాభర్తలు చేతులెత్తేయడంతో బాధితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్