ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) బోర్డులో ఏపీ ప్రభుత్వం 15 మంది కొత్త డైరెక్టర్లను నియమించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల నుంచి ఎంపికైన ఈ సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ నియామకాలపై ఏపీఐఐసీ ఎండీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.