ఉబర్, ఓలాలకు దీటుగా సర్కారీ క్యాబ్‌ యాప్

84చూసినవారు
ఉబర్, ఓలాలకు దీటుగా సర్కారీ క్యాబ్‌ యాప్
AP: రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు అండగా నిలిచేందుకు, వారికి వ్యాపారాన్ని అందించే బాధ్యత తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్‌ యాప్‌లను తొలగించలేమని, అయితే ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సర్కారీ క్యాబ్‌’ బుకింగ్‌ యాప్‌ను రూపొందిస్తామని తెలిపారు. ఈ యాప్‌ ఆర్థికంగా ఊరటనిస్తుందని, ఆటోస్టాండ్ల వద్ద నిరీక్షణకు ఇక తావుండదని సీఎం వివరించారు.

సంబంధిత పోస్ట్