గ్రామ సచివాలయాల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం

0చూసినవారు
గ్రామ సచివాలయాల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం
AP: కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేరును మార్చే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం’ గా మార్చాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయంపై ఆయన ప్రత్యేకంగా చర్చించారు. పాలనలో సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్పును సూచించారు. మరోవైపు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్