నకిలీ బిల్లులతో కోటి స్వాహా.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

746చూసినవారు
నకిలీ బిల్లులతో కోటి స్వాహా.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
ఏపీలోని నంద్యాల జిల్లా అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీఖాన్, నకిలీ బిల్లులు, అధికారుల సంతకాల ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి కోటి రూపాయలకు పైగా సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రభుత్వ ఆడిట్‌లో ఈ భారీ కుంభకోణం బయటపడటంతో, జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంతియాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కుంభకోణంలో మరికొందరి ప్రమేయంపై లోతుగా విచారణ జరుగుతోందని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు.

ట్యాగ్స్ :