పంచాయతీరాజ్‌లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

38చూసినవారు
పంచాయతీరాజ్‌లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP: పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదోన్నతులకు కనీస అర్హత రెండేళ్ల నుంచి ఏడాదికి సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒకేసారి 1,500 మందికిపైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి లభించనుంది. వీరిలో గ్రేడ్-1 కార్యదర్శలు, సీనియర్ అసిస్టెంట్లు 660 మంది డిప్యూటీ ఎంపీడీవోలుగా, మిగతా కార్యదర్శులు ఇప్పుడున్న గ్రేడ్ నుంచి అంతకంటే పైగ్రేడ్‌కు వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్