AP: మార్కాపురం జిల్లా పొదిలిలో తాగునీరు లేక కంబాలపాడు గ్రామస్థులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కిందని
వైసీపీ తెలిపింది. ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా అధికారులు తాగడానికి నీరు కూడా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారని పేర్కొంది. జనాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదని స్థితిలో ప్రభుత్వం ఉందా? అని సీఎం చంద్రబాబును
వైసీపీ ప్రశ్నించింది.