కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం: వైఎస్ షర్మిల

1159చూసినవారు
కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం: వైఎస్ షర్మిల
AP: పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తుంటే, ప్రభుత్వం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పాకులాడుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా అవసరాలను గాలికి వదిలేసి అమరావతి పనులకే ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని ఆమె విమర్శించారు. డీజిల్ దొరక్క రైతులు పొలాల్లో పనులు చేసుకోలేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రైతులకు, సామాన్యులకు ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :