వైస్ ఛైర్మన్, వైస్ ప్రెసిడెంట్లపై ప్రభుత్వం జీఓ జారీ

8337చూసినవారు
వైస్ ఛైర్మన్, వైస్ ప్రెసిడెంట్లపై ప్రభుత్వం జీఓ జారీ
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పరిషత్‌లో వైస్ ఛైర్మన్, ఎంపీపీలో వైస్ ప్రెసిడెంట్ ఇకపై ఒక్కరే ఉంటారని ప్రభుత్వం జీఓ 132ను జారీ చేసింది. అసెంబ్లీ చేసిన చట్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పదవులను రెండింటికి పెంచగా, తాజాగా కూటమి ప్రభుత్వం వాటిని ఒకటికి కుదించింది. గతంలోనే బీసీలకు రూరల్ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్