ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా తగ్గించింది. మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు కేవలం రూ.100, ఎక్కువైతే రూ.1,000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. తల్లిదండ్రులు వీలునామా లేకుండానే చనిపోతే, వారసులు పరస్పర అంగీకారంతో పంచుకున్న భూములను ఈ తక్కువ ఫీజుతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూమి వారసుల పేర్లపై ఆటోమేటిక్‌గా మారుతుంది.