AP: కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కనెక్షన్లను వెంటనే ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ 46,113 కనెక్షన్ల ఏర్పాటుకు సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, ఆ మేరకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.