ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు

17చూసినవారు
ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవోఆర్‌టీ నంబరు 1207 కింద 2002లో నియమితులైన 1,200 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వీరికి, రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2013లో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తాజాగా ఆ నియామకాలను ఖరారు చేస్తూ జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తాజాగా ఈ 1,200 మంది నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.