AP: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాలకు డిసెంబర్ క్యాలెండర్ రూపొందించినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదేశించారు. ప్రతినెలా 1న పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతోందని, ఇప్పటివరకు పింఛన్ల కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.