AP: అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 2,692.34 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా 1వ తేదీనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. లబ్ధిదారుల సౌకర్యార్థం సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తారన్నారు.