వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో రాజీనామా చేయగా 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లు చెప్పారు. 2023లో పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని పేర్కొన్నారు. మంత్రివర్గంలో వాలంటీర్లపై చర్చించిన అనంతరం ఆయన మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు.