ఏపీలో సదరం పేరుతో దళారుల వసూళ్లు.. హెచ్చరించిన ప్రభుత్వం

10307చూసినవారు
ఏపీలో సదరం పేరుతో దళారుల వసూళ్లు.. హెచ్చరించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ లో దళారుల మోసాలపై హెచ్చరిక జారీ చేసింది. వైకల్య ధ్రువపత్రాల జారీకి నిర్వహించే సదరం శిబిరాల్లో స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దివ్యాంగులు నేరుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఉచితంగా స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్