కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు!

19401చూసినవారు
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు!
AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశముంది. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించనుంది. అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించనుంది. అలాగే ఏజెన్సీలోని రంపచోడవరం డివిజన్‌తో పాటు చింతూరు డివిజన్‌లోని 4 మండలాలను విలీనం చేసి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్