AP: పేదల సొంతింటి కలను నేరవేర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వంలో మంజూరైన గృహనిర్మాణాలు వేగవంతం చేయాలని ఓవైపు అధికారులకు ఆదేశాలు ఇస్తూనే గ్రామాల్లోని పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. నగర, పురపాలికల పరిధిలో భూముల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సమాయత్తమైంది.