రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో
మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. స్కూళ్లలో ఎప్పుడూ బ్లాక్ బోర్డు కాదు అని దాని వెనకాల ప్లే గ్రౌండ్ కూడా ఉందని విద్యార్థులకు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా తీశానన్నారు. దీనిపై
చిరంజీవి స్పందిస్తూ.. 'కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారు, పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోతుంది. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలి' అని
చిరంజీవి అన్నారు.