AP: రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 అధికారుల తుది కేటాయింపును ప్రభుత్వం ఖరారు చేసింది. మల్టీజోన్-1 పరిధిలో 14 మందిని, మల్టీజోన్-2కు 23 మందిని కేటాయిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025, స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆప్షన్లు స్వీకరించిన అనంతరం తుది జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కేటాయింపు ఉత్తర్వులు
ఎన్నికలు పూర్తయిన తర్వాత అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.