AP: సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ చింతా మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపించారు. సామాజిక న్యాయం అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి పేరు మాత్రమే ఉందని, కానీ వారిలో వారికే ఐక్యత లేదన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. ఉద్యోగాలు రాక పట్టభద్రులు పారిశుద్ధ్య కార్మికులుగా మారుతున్నారని ఫైరయ్యారు.