ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లోనే బిల్లులు చెల్లింపు

55చూసినవారు
ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లోనే బిల్లులు చెల్లింపు
AP: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు ఎల్లుండి ప్రారంభమవనున్నాయి. ఇందుకోసం 3,013 ఆర్‌ఎస్‌కేలు, 2,061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు “HI” అని పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్