రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

41చూసినవారు
రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 3,013 ఆర్‌ఎస్‌కే కేంద్రాలు, 2,061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు 'HI' అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్