తపాలా శాఖ 'గ్రామ సురక్షా యోజన' పేరుతో జీవిత బీమా, అద్భుతమైన పొదుపు పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో రోజుకు కేవలం రూ.50 (నెలకు సుమారు రూ.1,500) పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షల వరకు పొందవచ్చు. ఈ ప్రీమియంను నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించే అవకాశం ఉంది. 19-55 ఏళ్ల భారత పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరితే రూ.10 లక్షల జీవిత బీమాను పొందవచ్చు. పాలసీదారునికి 80 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత, ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది. ఆ సమయంలో పూర్తి మొత్తం చేతికి అందుతుంది.